మెదక్ పార్లమెంట్ ముఖచిత్రం

351
kcr new
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలోని 17లోక్ సభ స్ధానాల్లో మెదక్ లోక్ సభ స్ధానం కూడా ఒకటి. పూర్వం మెదక్ జిల్లాను సిద్దాపూర్‌ అని పిలిచేవారు. సిద్దాపూర్ కాస్త క్రమేసి మెదక్ గా ఆవిర్భవించింది. హైదరాబాద్ నుండి సుమారు 100కి.మి దూరంలో ఈ మెదక్ పట్టణం ఉంది. 1952లో మెదక్ పట్టణం మునిసిపాలిటీగా ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా 2016లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల నిర్మాణం పునర్య్వస్థీకరణ చేపట్టింది. .అందులో భాగంగా మెదక్ జిల్లా పరిధిలో పునర్య్వస్థీకరణ ముందు ఉన్న 45 పాత మండలాలు నుండి 19 మండలాలుతో సంగారెడ్డి, 13 మండలాలుతో సిద్దిపేట కొత్త జిల్లాలుగా ఏర్పడగా,13 పాత మండలాలుతో మెదక్ జిల్లాను పునర్య్వస్థీకరించారు. మెదక్ పార్లమెంట్ ప్రాంతం నుంచి రెండు జాతీయ రహదారులు ఉన్నాయి. మెదక్ పార్లమెంట్ ప్రాంతం మహారాష్ట్ర ప్రాంతాన్ని ఆనుకొని ఉంటుంది. మెదక్ లో మొట్టమెదటి సారిగా 1886లో రైలుమార్గాన్ని వేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ విద్యాసంస్ధలైన గీతం యూనివర్సీటి, ఐఐటీ హైదరాబాద్, సుల్తంపుర్ లో జె.ఎన్.టి.యూ లు కూడా మెదక్ లోక్ సభ పరిధిలోనే ఉన్నాయి.

 medak church

నిర్మాణ, శిల్పకళల చాతుర్యాన్ని ప్రదర్శించే దేవాలయాలెన్నో మెదక్ జిల్లాలో ఉన్నాయి. బొంతపల్లి లోని వీరభద్ర స్వామి దేవాలయం , జరసంగం, మంజీరా నది ఒడ్డున గల ఏడుపాయలు లోని కనకదుర్గ ఆలయం, నాచగిరి లోని లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం , సిద్ధిపేట లోని కోటి లింగేశ్వర స్వామి ఆలయం ప్రసిద్దిగాంచినవి. మెదక్‌ జిల్లాలోని కొండాపూర్‌ వద్ద జరిపిన తవ్వకాల్లో శాతవాహనుల కాలం నాటి అవశేషాలు, బౌద్ధ నిర్మాణాలు బయట పడ్డాయి. పురావస్తు శాఖ వారు నిర్వహిస్తున్న సంగ్రహాలయం ఇక్కడ ఉంది. మెదక్ కేథలిక్ చర్చి ఇది ఆసియా లోకెల్లా పెద్దదైన డయోసీసే కాక వాటికన్‌ నగరం తరువాత ప్రపంచంలోనే పెద్దది కూడా. మెదక్ నగరం అంటే మనకు గుర్తుకు వచ్చేది మెదక్ చర్చే. అంతేకాకుండా మెదక్ పార్లమెంట్ ప్రాంతం ఇండస్ట్రీయల్ ఏరియాకు ఫేమస్ గా చెప్పుకోవచ్చు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి చాలా మంది కార్మికులు ఇక్కడ ఉన్న పరిశ్రమల్లో పనిచేస్తుంటారు. మెదక్ కోట, నిజాం సాగర్ ఆనకట్ట ఇలా చాలా ప్రాంతాలు మెదక్ లో ప్రసిద్దిగాంచినవి. ఇక ఏడుపాయల దుర్గా భవానీ ఆలయం ఇక్కడ చాలా ఫేమస్ గా చెప్పుకోవచ్చు. ఈ ఆలయ దర్శనానికి తెలంగాణా, కర్ణాటక మరియు మహారాష్ట్రా సమీప ప్రజలు లక్షల సంఖ్యలో వస్తుంటారు. ఇక్కడ ఉన్న ఏడుపాయలు అనే ప్రదేశంలో మంజీరా నది ఏడుపాయలుగా విడిపోయి ప్రవహిస్తున్న కారణంగా ఈ ప్రదేశానికీ పేరు వచ్చింది.

 medak edupayala

మెదక్ లోక్ సభ స్ధానం 1952లో ఏర్పడింది. మెదక్ పార్లమెంట్ పరిధిలో మొత్తం 7అసెంబ్లీ నియోజకర్గాలున్నాయి. సిద్దిపేట, మెదక్, నర్సాపూర్, సంగారెడ్డి, పటాన్ చెఱువు, దుబ్బాక, గజ్వేల్ నియోజవకవర్గాలు మెదక్ పార్లమెంట్ పరిధిలోకి వస్తాయి. ఈపార్లమెంట్ ప్రాంతంలో ఎందరో మహానియులు జన్మించారు. ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈపార్లమెంట్ స్ధానంలోనే జన్మించారు. అంతేకాకుండా కేసీఆర్ ఇక్కడ ఎంపీగా కూడా పనిచేశారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ కూడా మెదక్ పార్లమెంట్ స్దానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 1952లో తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో పిపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ పార్టీ అభ్యర్ధి ఎన్.ఎమ్. జయసూర్య గెలుపొందారు. జయసూర్య 1952 నుంచి 1957వరకూ మెదక్ ఎంపీగా సేవలందించారు. ఆ తర్వాత 1957,1962లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి పి. హనుమంతరావు విజయం సాధించారు. పి. హనుమంతరావు 10ఏండ్లు మెదక్ ఎంపీగా పనిచేశారు.

indira gandhi

ఆ తర్వాత 1967లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి సంగం లక్ష్మీ భాయి గెలుపొందారు. 1967 నుంచి 1971వరకూ లక్ష్మీభాయి మెదక్ ఎంపీగా సేవలందించారు. ఆతర్వాత జరిగిన 1971, 1977 పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజా సమితి పార్టీ అభ్యర్ధి డాక్టర్ మల్లిఖార్జున్ గెలుపొందారు. ఆ తర్వాత 1980లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఇందిరా గాంధీ విజయం సాధించారు. ఇందిరా గాంధీ మెదక్ ఎంపీగా 5సంవత్సరాలు సేవలందించారు. ఆ తర్వాత 1984లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధి పి. మానిక్ రెడ్డి గెలుపొందారు. 1989 నుంచి 1991వరకూ మానిక్ రెడ్డి మెదక్ ఎంపీగా పనిచేశారు. ఆ తర్వాత 1989, 1991, 1996లో జరిగిన ఎన్నికల్లో వరుసగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి ఎం. భాగరెడ్డి మూడు సార్లు విజయం సాధించారు. భాగరెడ్డి 1989 నుంచి 1999వరకూ ఎంపీగా ఉన్నారు. 1999లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ పార్టీ అభ్యర్ధి ఆలె నరేంద్ర గెలుపొందారు. ఆలె నరేంద్ర 1999నుంచి 2004వరకూ మెదక్ ఎంపీగా ఉన్నారు.

Kotha_Prabhakar_Reddy

ఆ తర్వాత 2004లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధిగా ఆలె నరేంద్ర మరోసారి విజయం సాధించారు. ఆలె నరేంద్ర మొత్తం 10ఏండ్లు మెదక్ ఎంపీగా పనిచేశారు. ఆ తర్వాత 2009లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధి విజయశాంతి గెలుపొందారు. విజయశాంతి 2009 నుంచి 2014 వరకూ మెదక్ ఎంపీగా సేవలందించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తొలిసారిగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి పోటీ చేసిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో కేసీఆర్ రెండు స్ధానాల నుంచి పోటీ చేయడంతో మెదక్ పార్లమెంట్ స్ధానానికి రాజీనామా చేశారు. ఆతర్వాత 2015లో జరిగిన ఉప ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్ స్దానం కాంగ్రెస్ అభ్యర్ధి సునీతా లక్ష్మారెడ్డిపై టీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధి కొత్త ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు. మెదక్ పార్లమెంట్ స్దానాన్ని చూసుకుంటే గత 20ఏళ్లుగా టీఆర్ఎస్ కు కంచుకోట గా ఉంది. అభ్యర్ధులు ఎవరైనా ప్రజలు మాత్రం టీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసిన వారికే పట్టం కడుతున్నారు. ఏదిఏమైనా మరోసారి మెదక్ పార్లమెంట్ స్ధానాన్ని టీఆర్ఎస్ కైవసం చేసుకోబోతుండంలో ఎటువంటి సందేహం లేదు. మెదక్ పార్లమెంట్ పరిధిలో 7అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్క స్ధానం తప్ప మిగతా ఆరు అసెంబ్లీ స్దానాలు టీఆర్ఎస్ గెలుచుకుంది. దీంతో ఈసారి జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కూడా మెదక్ పార్లమెంట్ స్ధానంపై గులాబీ జెండా ఎగురుతుందని బల్లగుద్ది చెప్పొచ్చు.

- Advertisement -