కేసీఆర్ , జగన్ ల కోసం మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి

325
Jagan Kcr Kamal Nath
- Advertisement -

ఎలాగైనా ఈసారి కేంద్రంలో బీజేపీకి అధికారం దక్కకుండా పక్కా ప్రణాళికలు రూపొందిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇందుకోసం ఏకంగా యూపీఎ చైర్ పర్సన్ సోనియా గాంధీ రంగంలోకి దిగారు. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలన్నింటిని ఏకథాటిపైకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ కు కీలక బాధ్యతలు అప్పగించారు సోనియా గాంధీ. తటస్ధంగా ఉన్న పార్టీలన్ని తమకు మద్దతు ఇవ్వాలని కోరనున్నారు.

ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, వైసీపీ అధ్యక్షుడు జగన్ ను బుజ్జగించేందుకు కమల్ నాథ్ ను రంగంలోకి దించారు కాంగ్రెస్ అధిష్టానం. వీరిద్దరితో కమల్ నాథ్ త్వరలో చర్చలు జరుపనున్నట్లు తెలుస్తుంది. కమల్ నాథన్ తో పాటు మరో ఇద్దరూ ఏఐసిసీ నాయకులు కూడా రానున్నట్లు సమాచారం. ప్రాంతీయ పార్టీల డిమాండ్లు, అభిప్రాయాలను తెలుసుకుని యూపిఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేయాల్సిన పనుల గురించి చర్చించనున్నట్లు తెలుస్తుంది.

ఇక కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదాకు మద్దతు ఇస్తామని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. జగన్ పై తప్పుడు కేసులు పెట్టిన కాంగ్రెస్ ను ఆయన మద్దతు ఇవ్వరని పలువురు వైసిపి నాయకులు చెబుతున్నారు. కాంగ్రెస్ కు ప్రధాన మంత్రి పదవి దక్కపోయిన పరవాలేదు కానీ బీజేపీకి మాత్రం అధికారం ఇవ్వబోమని స్పష్టం చేశారు గులాం నబీ ఆజాద్. బీజేపీ అధకారంలోకి రావడం ఏ ప్రాంతీయ పార్టీకి ఇష్టం లేదన్నారు.

- Advertisement -