నేటి నుంచి మందు బంద్‌.. గీత దాటితే శిక్ష తప్పదు

314
Liquor
- Advertisement -

లోక్‌ సభ ఎన్నికలకు ఇంకా ఒక్క రోజు మాత్రమే ఉంది. నేటితో ఎన్నికల ప్రచారాలు ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో పలు పార్టీలు 11న ఓటింగ్‌ పై దృష్టి పెట్టాయి. అయితే ఎన్నికల కమీషన్‌ ఓటింగ్‌ సజావుగా జరుపుటకు కట్టుదిట్టమైన బద్రత ఏర్పట్లు చేసింది. ఓటర్లు ఎలాంటీ ప్రలోభాలకు గురి కాకుండా మద్యం రవాణా,మనీ రవాణాపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం 6 నుంచి గురువారం సాయంత్రం 6గంటల వరకు మద్యం విక్రయాలను నిషేధిస్తున్నట్లు ఆబ్కారీ అధికారులు వెల్లడించారు. మంగళవారం సాయంత్రం 6గంటల వరకు మాత్రమే మద్యం విక్రయాలు జరగనుండడంతో అడ్డగోలుగా మద్యం కొనుగోలు చేసుకోకుండా ఈసీ ఆంక్షలు విధించింది.

ఓటర్లను మద్యంతో మభ్యపెట్టే ప్రయత్నాలు జరగకుండా చర్యలు చేపట్టాలని ఆబ్కారీ శాఖను ఆదేశించింది. ఈసీ ఆదేశాల మేరకు ఆబ్కారీ నిఘా పెంచింది. మద్యం విక్రయాలకు సంబంధించిన లెక్కలు పక్కాగా ఉండాలని, ఏరోజు కారోజు మద్యం క్రయ, విక్రయాల వివరాలను సమర్పించాల్సిందిగా ఈసీ ఆబ్కారీశాఖను ఆదేశించిన నేపథ్యంలో మద్యం లెక్కలపై ఆబ్కారీ అధికారులు పక్కా ప్రణాళికను అమలు చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయాలు జరిపే మద్యం దుకాణాలపై ఎన్నికల నియమావళి ప్రకారం చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేశారు. ఎవరైన నిబంధనలకు విరుద్ధంగా మద్యం కొనుగోలు చేసినా, నిల్వ చేసుకున్నా వారిపై చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.

- Advertisement -