నేటీతో ఎన్నికల ప్రచారాలు బంద్‌..

202
Lok Sabha election 2019
- Advertisement -

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు విస్తృత ప్రచారం చేసిన పలు పార్టీల ప్రచార కార్యక్రమాలు మంగళవారంతో సమాప్తం కానున్నాయి. పోటాపోటీ ప్రచారాలు…. విమర్శలు, ప్రతి విమర్శలు… ఆరోపణలు…ప్రత్యారోపణలు… సభలు, సమావేశాలు, ర్యాలీలు…రోడ్‌షోలు.. ఇలా అన్ని విధాల ప్రచారాలు సాయంత్రానికల్లా ముగియనున్నాయి.

నేటితో ప్రచార సమయం ముగుస్తున్న నేపథ్యంలో ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ప్రచార వేడిని పెంచాయి. బహిరంగసభలతోపాటు ర్యాలీలు, ఇంటింటికీ ప్రచారంలో అన్ని పార్టీలు ఈ రోజు తలమునకలయ్యాయి. ఎన్నికల ప్రచార సమయం ముగిసిన తర్వాత పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్‌మీడియాలో ఎలాంటి ప్రకటనలు ఇవ్వరాదని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఉల్లంఘించేవారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది.

ప్రచారం ముగిసిన తర్వాత రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే ప్రమాదం ఉందని గుర్తించిన ఎన్నికల సంఘం నగదు, మద్యం పంపిణీని అడ్డుకోవడానికి తనిఖీలను ముమ్మరం చేయనున్నది. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలను దక్కించుకోవడమే లక్ష్యంగా అన్ని పార్టీలు ఎంతో శ్రమిస్తున్నాయి. ప్రచార గడువు ముగియడంతో ఇక పార్టీలన్నీ 11వ తేదీన జరగనున్న పోలింగ్‌ ప్రక్రియపై దృష్టి సారించనున్నాయి. అందుకు తగిన ఏర్పాట్లలో తలమునకలు కానున్నాయి.

- Advertisement -