కూచిబొట్ల హత్యకేసు..నిందితుడికి జీవితఖైదు

263
Kuchies killer gets lifetime
- Advertisement -

అమెరికాలో హత్యకు గురైన తెలుగు టెక్కీ శ్రీనివాస్ కూచిబొట్లను హతమార్చిన నిందితుడు ప్యురింటన్‌కు జీవిత ఖైదు విధించింది అమెరికా ఫెడరల్ కోర్టు. ఆడమ్‌ డబ్య్లూ పురింటన్ జాత్యాహంకారంతోనే శ్రీనివాస్‌పై కాల్పులు జరిపి అతడిని హత్య చేసినట్లు న్యాయస్థానం నిర్థారించింది. తీర్పు అనంతరం కూచిబొట్ల భార్య సునయన న్యాయస్థానానికి ధన్యవాదాలు తెలిపారు. తన భర్త ఎంతో మంచి వాడని, ప్యురింటన్ జీవితంలో ఏదో ఒకరోజు తన తప్పు తెలుసుకుంటాడని వ్యాఖ్యానించింది. ఇలాంటి ఘటనలు ఇకముందైనా జరగకుండా చూడండి. ఈ కేసులో అండగా నిలబడిన ఓలేత్‌ పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు.

గతేడాది ఫిబ్రవరి 22న స్నేహితుడైన అలోక్ మాదసానితో కలిసి కాన్సాస్‌‌లోని ఓ బార్‌‌‌కి వెళ్లిన సమయంలో ప్యురింటన్ శ్రీనివాస్‌పై కాల్పులకు తెగబడ్డాడు. నా దేశం నుంచి వెళ్లిపోండని పెద్దగా అరుస్తూ కాల్పులు జరిపాడు.ఈ ఘటనలో శ్రీనివాస్‌ అక్కడిక్కడే మృతి చెందగా, అలోక్‌ తీవ్రంగా గాయపడ్డారు.

ప్యురింటన్‌కు జీవిత ఖైదు విధించడంతో ఇక జీవితమంతా జైలులోనే గడపాల్సి ఉంది. 50ఏళ్ల జైలుశిక్ష తర్వాతే అతడికి పెరోల్‌ లభిస్తుంది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ ప్రమాణ స్వీకారం చేసిన దాదాపు నెల తర్వాత ఈ దారుణం చోటు చేసుకోవడంతో అమెరికాలోని భారతీయులు ఎంతో భయాందోళనకు గురయ్యారు. ఈ తర్వాత ట్రంప్‌ కూడా ఈ ఘటనపై స్పందించారు.

- Advertisement -