టీ వ్యాలెట్ ప్రారంభించిన కేటీఆర్‌

304
IT minister KTR Launched RTA m-Wallet,first of its kind app in India.
IT minister KTR Launched RTA m-Wallet,first of its kind app in India.
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన టీ-వ్యాలెట్‌ను తాజ్‌డెక్కన్‌లో ఐటీ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా వ్యాలెట్ ద్వారా చెల్లింపు చేయవచ్చు. ఆంగ్లంతో పాటు తెలుగు, ఉర్దూ భాషల్లోనూ టీ వ్యాలెట్ వాడుకోవచ్చు. ఉపకారవేతనాలు, పింఛన్లతో పాటు రేషన్ దుకాణాలకు టీ వ్యాలెట్‌ను అనుసంధానం చేయనున్నారు. పోన్ లేకున్నా మీ సేవ సెంటర్ల సహాయంతో టీ వ్యాలెట్ ద్వారా లావాదేవీలు జరిపే అవకాశం ఉంది. టీ వ్యాలెట్ ద్వారా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు చెల్లింపులకు అవకాశం ఉంటుంది.

అనంతరం ఐటీశాఖకు సంబంధించిన 2016-17 వార్షిక నివేదికను విడుదల చేసిర కేటీఆర్.. ఉత్తమ ప్రతిభ కనపరిచిన ఐటీ కంపెనీలకు అవార్డులు అందజేశారు. ఈ సంధర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఆవిర్బించి మూడేళ్లవుతోందన్నారు. రాష్ట్రం ఏర్పడే నాటికి ఎన్నో సవాళ్లు ఉన్నప్పటికీ.. వాటిని అదిగమించి ముందుకు వెళుతున్నామన్నారు. తెలంగాణ నుంచి రూ.57 వేల కోట్ల విలువైన ఐటీ, ఐటీ ఆధారిత ఎగుమతులు చేశామన్నారు.

KTR

మీసేవ ఈ-లావాదేవీలలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉందన్న కేటీఆర్‌.. ప్రతి వెయ్యి మందికి 12వేల ఈ లావాదేవాలతో రాష్ట్రం తొలిస్థానంలో నిలిచిందన్నారు. కేంద్ర ప్రభుత్వం నోట్ల రద్దును సమర్ధించి డిజిటల్ లావాదేవీలు ప్రోత్సహించాం. ఇప్పుడు డిజిటల్ లావాదేవీల్లో తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా ఉందని మంత్రి ప్రకటించారు.

రాష్ట్ర ఐటీ ఎగుమతుల వృద్ధి 13.85 శాతం, జాతీయవృద్ధి 10 శాతం ఉందని, జాతీయ వృద్ధికంటే రాష్ట్ర వృద్ధి రేటు ఎక్కువగా ఉందిని తెలిపారు. గతేడాది ఐటీ, ఐటీ ఆధారిత రంగాల ద్వారా 24,506 మందికి అదనంగా ఉపాధి లభించింది. మొత్తం ఐటీ రంగంలో 4,31,891 మందికి ఉపాధి లభించినట్లు నివేదికలో పేర్కొన్నారు. ఏడాది కాలంలో 3.62 కోట్ల మందికి ఎలక్ట్రానిక్ సేవలు అందిచినట్లు తెలిపారు.

ప్రసిద్ధిగాంచిన పలు అంతర్జాతీయంగా సంస్థలు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. కాలిఫోర్నియా వెలుపల అతిపెద్ద క్యాంపస్‌ను ఆపిల్ కంపెనీ హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనుంది. తెలంగాణను ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల హబ్‌గా ఆవిష్కరిస్తున్నాం. రావిరాల వద్ద మూడువేలకు పైగా ఎకరాల్లో ఈ-సిటీ నిర్మాణం చేస్తున్నాం. ప్రఖ్యాత ముబైల్ కంపెనీ డాటావిండ్ తన ఉత్పత్తులను ప్రారంభించిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథను నీతిఆయోగ్‌తో పాటు అన్ని రాష్ర్టాలు అభినందించాయి. ఈ పథకాన్ని మరో 11 రాష్ర్టాలు అమలు చేసేందుకు అధ్యయనం చేశాయి.

- Advertisement -