కేటీఆర్‌ పెద్దమనసు..బాలిక వైద్యానికి భరోసా

445
ktr ravali
- Advertisement -

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి పెద్దమనసు చాటుకున్నారు. తన దృష్టికి వచ్చిన ఏ సమస్యనైన పరిష్కారం చేస్తూ అందరి మన్ననలు పొందుతున్న రామన్న తాజాగా ఎదుగుదల లోపంతో బాధపడుతున్న యువతికి చికిత్సకు భరోసానిచ్చారు.

సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేటకు చెందిన కనకట్ల దేవేందర్ బీడీ ఖార్ఖానాలో రోజువారి కూలీగా పనిచేస్తున్నాడు. దేవేందర్ భార్య బాలమణి బీడీలు చుడుతూ కుటుంబానికి అండగా నిలుస్తోంది. రెక్కాడితేగాని డొక్కాడని వీరికి రవళి(18) అనే కూతురు ఉంది. చిన్నప్పటి నుండి ఎదుగుదల లోపంతో బాధపడుతోంది. వయసు పెరుగుతున్న శారీరక,మానసిక ఎదుగుల లేదు. ఎంతమంది డాక్టర్లకు చూపించిన పరిష్కారం కాలేదు.

ఇటీవల హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చూపించగా చికిత్సకోసం రూ. 2లక్షల ఖర్చు అవుతుందని చెప్పారు. అంతపెద్ద మొత్తం భరించలేని స్థితిలో స్ధానిక టీఆర్ఎస్ నేతలతో కలిసి సమస్యను కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వెంటనే స్పందించిన కేటీఆర్ ఆమె వైద్య ఖర్చుల కోసం అవసరమైన రూ. 2 లక్షల ఎల్వోసీ మంజూరుచేశారు. కేటీఆర్ చేసిన సాయం మర్చిపోమని జీవితాంతం రుణపడి ఉంటామని రవళి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -