విజయవాడకు సీఎం కేసీఆర్

225
KCR to visit Andhra again
- Advertisement -

ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన సందర్భంగా, టీటీడీకి మొక్కులు చెల్లించే సందర్భంగా, ఆయుత చండీయాగం సందర్భంగా చంద్రబాబును ఆహ్వానించడానికి ఏపీకి వెళ్లిన సీఎం  తాజాగా ఈ నెల 27న విజయవాడకు వెళ్లనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున కనకదుర్గమ్మకు  బంగారు ముక్కపుడకను కానుకగా ఇచ్చి మొక్కు చెల్లించనున్నారు. సతీ సమేతంగా  అమ్మవారికి పట్టువస్త్రాలను కూడా కేసీఆర్ సమర్పించనున్నారు.

ఉద్యమసమయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కనకదుర్గమ్మకు ముక్కుపుడక సమర్పిస్తానని  కేసీఆర్ మొక్కుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సీఎం బెజవాడలో పర్యటించనున్నారు.  ఇప్పటికే వరంగల్ లోని భద్రకాళి అమ్మవారికి బంగారు ఆభరణాలు సమర్పించారు.

కొద్దికాలం క్రితం తిరుమల వెళ్లి కలియుగ దైవం మొక్కు చెల్లించుకున్నారు. దాదాపు 5 కోట్ల విలువైన ఆభరణాలను శ్రీనివాసునికి కానుకగా సమర్పించనున్నారు. రెండు హారాలు – పద్మావతి అమ్మవారికి ఒక ముక్కు పుడకను సమర్పించి కేసీఆర్ మొక్కు చెల్లించుకున్నారు. దీంతోపాటుగా కురవి వీరభద్రుడికి బంగారు మీసం మొక్కు సమర్పించుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ఖజానా నుంచి నిధులు మంజూరు చేయించారు. తాజాగా విజయవాడ దుర్గమ్మకు మొక్కులు చెల్లించడంతో సీఎం మొక్కులు తీరినట్లైంది.

విజయవాడ పర్యటనలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబుతో కేసీఆర్ భేటీ కావచ్చని తెలుస్తోంది. ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలు వీరి భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది.

- Advertisement -