స్థానిక ఎన్నికలకు టీఆర్ఎస్ సన్నద్ధం..

289
Trs
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో పరిషత్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలకావడంతో.. అభ్యర్థుల ఎంపికపై టీఆర్‌ఎస్ నాయకత్వం మరింత వేగాన్ని పెంచింది. మొదటి విడుత ఎన్నికల నామినేషన్ల దాఖలుకు కొద్దిరోజుల గడువు మాత్రమే ఉండటంతో ప్రక్రియను త్వరగా పూర్తిచేయాలని నిర్ణయించారు.

ఇటీవల టీఆర్‌ఎస్‌ భవన్‌లో జరుగుతున్న టీఆర్‌ఎస్ పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరిగిన విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్‌ అధ్మక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా పరిషత్‌, మండల పరిషత్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై విస్తృతంగా చర్చ జరిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో భారీ విజయమే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ కార్యవర్గానికి సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్యేలు అభ్యర్థులను ఎంపిక చేసి వారిని గెలిపించే బాధ్యత కూడా వారిదేనంటూ కేసీఆర్ స్పష్టంచేశారు.

CM KCR

రాష్ట్రంలో మొత్తం 32 జడ్పీ, 530కి పైగా మండల పరిషత్‌ స్థానాలను కైవసం చేసుకోవాలని కేసీఆర్‌ సూచించారు. ఒక్కో జిల్లా పరిషత్‌కు ఓ సీనియర్‌ నేతకు బాధ్యతలు అప్పగించారు. మండల పరిషత్‌లలో బాధ్యతలను ఆ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు చూసుకోవాలని సూచించారు. స్థానిక ఎన్నికల్లోనూ శక్తివంచన లేకుండా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

- Advertisement -