కేసీఆర్ బయోపిక్…గులాల్

244
KCR movie-Gulaal poster launched
- Advertisement -

సీఎం కేసీఆర్ జీవితచరిత్రపై మరో సినిమా తెరకెక్కనుంది. దర్శకుడు రాంగోపాల్ వర్మ సినిమా తెరకెక్కిస్తానని ప్రకటించగా దర్మపధ క్రియేషన్స్ బ్యానర్‌పై మధుర శ్రీధర్ రెడ్డి సైతం సినిమాను నిర్మిస్తున్నట్లు ప్రకటించారు.   తాజాగా  బందూక్‌తో తెలంగాణ ప్రజల మన్ననలు పొందిన దర్శకుడు లక్ష్మణ్….సీఎం కేసీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకు గులాల్ అనే టైటిల్ ఖరారు చేయగా హైదరాబాద్‌లో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది.

ప్రముఖ రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ సినిమా పోస్టర్‌ని ఆవిష్కరించారు.  తెలంగాణ విజయం, బంగారు తెలంగాణ నిర్మాణం నేపథ్యంలో సమన్వి క్రియేషన్స్ పతాకంపై లక్ష్మణ్ కొణతం ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాలను తెలియజేస్తూ గులాల్ అంటే కేవలం ఒక రంగు మాత్రమే కాదు. ఒక విజయం, ఒక సంతోషం, ఒక సంబురం.. విజయానికి గుర్తు. రైతు బాందవుడు, తెలంగాణ సాధకుడు మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన విధానాన్ని అధ్యయనం చేసి, 60 సంవత్సరాల ఆయన జీవితంలో బాల్యం నుండి.. ఎన్నో సవాలను ఎదుర్కొని, తెలంగాణ సాధన, బంగారు తెలంగాణ నిర్మాణం దిశలో సాగుతున తన ఆలోచన విధానాన్ని ప్రతిబింబిస్తూ, రైతులు దేశానికి వెన్నుముక, నేటి యువత రేపటి సమసమాజ నిర్మాతలు అని ఆలోచించే కేసీఆర్  ఆలోచనలకు ప్రతిరూపంగా రూపుదిద్దుకుంటున్న చిత్రం గులాల్ అని తెలిపారు.

kcr
భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకోనున్న ఈ చిత్రంలో కేసీఆర్ పోరాట పటిమ, గౌతమబుద్దుడిగా ఆయన ఆలోచనవిధానం, భారత స్వాతంత్య్రంలో మహాత్మగాంధీలా ఉద్యమ స్ఫూర్తి, నెల్సన్‌మండేలా, మార్టిన్ లూధర్ కింగ్‌ల ఆలోచించే ఆయన అనుసరించే విధానం.. బంగారు తెలంగాణ నేపథ్యంలో భారీ తారాగణంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఈ చిత్రంలో ఓ జాతీయస్థాయి నటుడు ముఖ్యపాత్రను పోషిస్తాడు అని తెలిపారు.

ఈ చిత్రానికి సాహిత్యం: నందిని సిద్దారెడ్డి, గోరేటి వెంకన్న, సుద్దాల అశోక్‌తేజ, సంగీతం: కార్తీక్ కొడకండ్ల, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: రాహుల్ మాచినేని, స్క్రీన్‌ప్లే-సహకారం; హుస్సేన్ షా కిరణ్, రచనా సహకారం: వెంకట్, మాటలు: అజయ్, లైన్ ప్రొడ్యూసర్: రమేష్ మాదాసు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సాయి, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: బందూక్ లక్ష్మణ్.

- Advertisement -