కేసీఆర్‌ను కలిసిన కామన్వెల్త్ విజేతలు

329
kcr
- Advertisement -

క్రీడలను ప్రోత్సహించడంలో తెలంగాణ ప్రభుత్వం అన్నివిధాలా ముందు ఉంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. కామన్ వెల్త్ క్రీడల్లో మెడల్స్ సాధించిన క్రీడాకారులను ఆయన ఈరోజు సన్మానించారు. 5 రాష్ట్రాలకు చెందిన 18 మంది మెడల్ విన్నర్స్ ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలుసుకున్నారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో కోచ్ పుల్లెల గోపిచంద్,క్రీడాకారులు కిదాంబి శ్రీకాంత్ ,సైనా నెహ్వాల్,పీవీ సింధు తదితరులు ఉన్నారు. వీరందరికి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా శాలువాలు కప్పి పుష్పగుచ్చాలను అందించారు. క్రీడాకారులను ప్రోత్సహించడంలో తెలంగాణ ప్రభుత్వం అన్నివిధాలా సహకరిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.

తెలంగాణ ప్రభుత్వం తమ ఉద్యోగాల్లో అంతర్జాతీయ స్ధాయి క్రీడాకారులకు కొంత రిజర్వేషన్‌ను కల్పించగలదని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. రాష్ర్టానికి, దేశానికి మంచి గౌరవం తీసుకువచ్చారని క్రీడాకారులను సీఎం అభినందించారు. అంతర్జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులను ప్రోత్సహిస్తామన్నారు సీఎం. ప్రభుత్వ ఉద్యోగాల్లో క్రీడాకారులకు 2 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని సీఎం అన్నారు.

హైదరాబాద్‌కు చెందిన సానియా మీర్జాను తెలంగాణ అంబాసిడర్‌గా కేసీఆర్ నియమించిన విషయం తెలిసిందే. అదేవిధంగా సైనా,సింధు,సానియా వంటి అంతర్జాతీయ క్రీడాకారులకు గతంలో నగదు బహుమతులను కూడా ప్రకటించారు. కొంతమందికి ఇళ్ల స్ధలాలు కూడా కేటాయించారు. మరికొంతమంది క్రీడాకారులకు వ్యక్తిగతంగా కూడా సహాయసహకారాలను కేసీఆర్ అందజేశారు.

- Advertisement -