” 83″ మూవీలో కపిల్ దేవ్ కూతురు..  

274
Kapil Dev Daughterr
- Advertisement -

టీంఇండియా మాజీ కెప్టెన్, క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ కుమార్తె అమియా దేవ్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. 1983లో జరిగిన ప్రపంచకప్‌లో విండీస్‌ను ఓడించి దేశానికి ప్రపంచకప్ అందించి కపిల్ దేశానికి గర్వకారణంగా నిలిచాడు. తాజాగా బాలీవడ్ లో ఆయన జీవిత చరిత్ర ఆధారంగా 83 పేరుతో బయోపిక్ తెరకెక్కుతుంది. ఈచిత్రంలో కపిల్ దేవ్ పాత్రలో రణవీర్ సింగ్ నటిస్తుండగా..కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్నారు.

మే నెల నుంచి ఈచిత్రం రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభకానుంది. ఇప్పటికే రణ్ వీర్ సింగ్ క్రికెట్ లో శిక్షణ కూడా తీసుకున్నాడు. ఈచిత్రంలో కపిల్ దేవ్ కూతురు బాలీవుడ్ కు పరిచయం కానుంది. అయితే ఆమె యాక్టర్ గా కాకుండా దర్శకురాలిగా పరిచయం కానుంది. అమియా తాజాగా డిగ్రీ పూర్తిచేసుకుంది.

అమియాకు చిన్నతనం నుంచే క్రికెట్ మీద మంచి పట్టుఉండటంతో ఆమెను ఈసినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా తీసుకున్నట్లు తెలుస్తుంది. క్రికెట్ మీద ఆమెకు పూర్తి అవగాహన ఉండటంతో సినిమాకు లాభం చేకూరుతుందని తెలిపారు 83 చిత్రయూనిట్. అసిస్టెంట్ దర్శకురాలిగా తనకు అవకాశం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు అమియా.

- Advertisement -