దుమ్మురేపుతున్న…కాలా

241
Kaala (Tamil) - Official Teaser
- Advertisement -

సూపర్‌స్టార్‌ రజనీకాంత్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘కాలా’ టీజర్ విడుద‌లైంది. ర‌జ‌నీ స్తైల్‌, డైలాగులు, యాక్ష‌న్ సీన్లు అల‌రించేలా టీజర్ సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. రజనీ..కరికాలన్‌ అనే డాన్‌ పాత్రలో నటించగా బాలీవుడ్ నటి హుమా ఖురేషి హీరోయిన్‌గా నటించింది. నానా పటేకర్ విలన్ పాత్రలో నటించగా ఏప్రిల్‌ 27న సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.

మార్చి 1న తెలుగు, త‌మిళ భాష‌ల‌లో టీజర్  విడుద‌ల చేయ‌నున్న‌ట్టు మేక‌ర్స్ ప్ర‌క‌టించిన‌ప్ప‌టికి కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి మరణించిన నేపథ్యంలో ఇవాళ విడుదల చేశారు. వండ‌ర్ బార్ ఫిలింస్ బాన‌ర్‌పై ధ‌నుష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా పా. రంజిత్ తెరకెక్కించారు. ముంబై నేప‌థ్యంలో సాగే ఈ చిత్రంలో ర‌జ‌నీకాంత్ మాఫియా డాన్ గా అద‌ర‌గొట్టాడ‌ని టీజ‌ర్‌ని బ‌ట్టి చెబుతున్నారు.

- Advertisement -