సుభిక్ష రాష్ట్రంగా తెలంగాణ

181
Its all prosperity says Sastri
- Advertisement -

దిగ్విజయ పథకాలతో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని బాచంపల్లి సంతోష్‌ కుమార్‌ శాస్త్రి అన్నారు. ఉగాది పర్వదినం సందర్భంగా ప్రగతి భవన్‌లో నిర్వహించిన ఉగాది వేడుకల్లో సంతోష్‌ కుమార్‌ శాస్త్రి పంచాగ శ్రవణం చెప్పారు. బంగారు తెలంగాణ అతి త్వరలోనే సిద్ధిస్తుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం అవతరించిన నాటి రాశి, రాష్ట్ర పాలకుడి రాశి రెండూ ఒకటేనని తెలిపారు. ఈ సంవత్సరం శుభములే ఎక్కువ ఉన్నాయని, ఈ విళంబి నామ సంవత్సరంలో మీడియా, సినీ రంగానికి మంచి రోజులున్నాయని పేర్కొన్నారు సంతోష్‌ కుమార్‌ శాస్త్రి.

క్రీడా రంగంలో తెలంగాణ రాష్ట్రం అద్భుత ఫలితాలు సాధిస్తుంది. ఈ ఏడాది కూడా వర్షాలు బాగా పడుతాయని తద్వార చెరువులు నిండుతాయని, అక్టోబర్ నుంచి వర్షాలు కురుస్తాయని చెప్పారు సంతోష్‌ కుమార్‌ శర్మ. డిసెంబర్‌లో వరదలు వస్తాయి. రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందుతుంది. అన్ని రంగాల్లోని స్త్రీలకు మంచి ఫలితాలు వస్తాయన్నారు. ఈ సంవత్సరం అందరూ పాటించాల్సిన ఈ సూచనను పాటించాలని, అదేమంటే ఆదివారం నాడు ఎవరూ కూడా మాంస భక్షణ చేయకుండా ఉంటే అందరికీ మంచి జరుగుతుందని చెప్పారు.చివరగా బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి తాను చెప్పిన దాంట్లో ఎటువంటి అతిశయోక్తులు లేవని.. గ్రహల ప్రకారమే పంచాగం చెప్పానని  స్పష్టం చేశారు.

- Advertisement -