శివాజీ రాజాకి గట్టి కౌంటర్ ఇచ్చిన హైపర్ ఆది..

560
Hyper Aadi
- Advertisement -

నరసాపురం జనసేన ఎంపీ అభ్యర్థి నాగబాబుకు ఓటెయ్య వద్దంటూ నటుడు శివాజీ రాజా ఇచ్చిన పిలుపునకు పవన్ వీరాభిమాని, జబర్దస్త్ ఫేం హైపర్ ఆది గట్టి కౌంటర్ ఇచ్చాడు. ‘‘శివాజీ రాజా గారూ ఒక సీనియర్ ఆర్టిస్టుగా మీరంటే నాకు ఎంతో గౌరవం. కానీ మీరు నాగబాబు గురించి మాట్లాడినదాంట్లో ఒక్కటి కూడా నిజం లేదు. మీరు ఆ మాటలన్నీ కూడా వెనక్కి తీసుకోవాలి. చిరంజీవిగారంటే చాలా ఇష్టమని అంటున్న మీరు… నాగబాబు గారిని తిడితే చిరంజీవిగారికి నచ్చుతుందా? ఒక్కసారి ఆలోచించండి. పవన్ కళ్యాణ్ గారంటే నాకు ప్రాణమని చెబుతున్నారు.. ఆయన ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టిన నాగబాబుకి ఓటు వేయవద్దు అని మీరు చెబితే పవన్ కళ్యాణ్‌కి నచ్చుతుందా?” అని హైపర్ ఆది ప్రశ్నించారు.

నాగబాబు పిల్లికి కూడా భిక్షం పెట్టడన్న శివాజీ రాజా ఆరోపణలపై హైపర్ ఆది స్పందిస్తూ.. ఎవరి భిక్షంపై రెండేళ్లు ‘మా’ అధ్యక్షుడిగా పనిచేశారో చెప్పాలని ప్రశ్నించాడు. ఎవరి పని వాళ్లు చూసుకోవాలని, కుక్క పనిని గాడిద చేస్తానంటే కుదరదని పేర్కొన్నాడు. ‘మా’ ఎన్నికల్లో ఓడిపోయాననే అక్కసుతోనే ఇలా మాట్లాడుతున్నట్టు అర్థమైందని, అది మంచిది కాదని హితవు పలికాడు. దమ్ముంటే నరసాపురం సెంటర్‌కు వచ్చి మాట్లాడాలని, ఎవరిని ఎవరు తరిమి కొడతారో తెలుస్తుందని హైపర్ ఆది సవాల్ విసిరాడు.

- Advertisement -