రివ్యూ : హాలో

395
Hello movie review
- Advertisement -

మనం   ఫేం విక్రం కుమార్ దర్శకత్వంలో  అఖిల్ హీరోగా తెరకెక్కిన సినిమా  హలో. అన్నపూర్ణ  స్టూడియోస్ బ్యానర్‌పై నాగార్జున నిర్మించిన ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. తొలి సినిమా అఖిల్ మూవీ ఫ్లాప్‌ కావడంతో రెండేళ్ళ గ్యాప్ తర్వాత అఖిల్ మళ్ళీ నటిస్తున్న చిత్రమిది. విడుదలకు ముందే భారీ హైప్‌ క్రియేట్‌ అయిన ఈ చిత్రంతో అఖిల్ హిట్ కొట్టాడా..?విక్రంపై నాగ్ పెట్టుకున్న అంచనాలు నిజమయ్యాయా..?లేదా చూద్దాం.

కథ:

శీను(అఖిల్‌)  అనాథ. జున్ను (కల్యాణి) ఓ పెద్దింటి అమ్మాయి. చిన్నప్పుడే ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడుతుంది. జున్నునే తనకు కాబోయే భార్య అని ఫిక్స్  అవుతాడు శీను. అనుకోకుండా జున్ను కుటుంబం ఢిల్లీ వెళ్లిపోతుంది. పదిహేనేళ్ల తర్వాత జున్ను ఎలాగైనా శీనుని కలవడానికి హైదరాబాద్ వస్తుంది. కట్ చేస్తే ….వీరిద్దరూ ఎలా కలుసుకున్నారు. అవినాశ్‌, ప్రియలుగా పరిచయమమైన శీను, జున్నులు ఒకరికొకరు ఎలా గుర్తుపట్టారు? అన్నదే హలో కథ.

 Hello movie review
ప్లస్ పాయింట్స్:

సినిమాకు మేజర్ ప్లస్‌ పాయింట్స్ అఖిల్ నటన,డ్యాన్స్‌,స్టంట్స్‌,నిర్మాణ విలువలు,పాటలు,బ్యాక్‌ గ్రౌండ్ మ్యూజిక్. అఖిల్ తన తొలిసినిమాకు ఈ సినిమాకు వైవిధ్యాన్ని కనబర్చాడు. తనదైన నటనతో ఫ్యాన్స్‌ని కట్టిపడేశాడు. ముఖ్యంగా డ్యాన్స్‌,ఫైట్స్‌ ఇరగదీశాడు. తొలి సినిమాతోనే కళ్యాణి  ఆకట్టుకుంది. హీరో,హీరోయిన్‌ మధ్య కెమిస్ట్రి బాగా కుదిరింది. సీనియర్ నటులు జగపతి బాబు,రమ్యకృష్ణ అజయ్ తమ పాత్రలకు ప్రాణం పోశారు. చివరి 20 నిమిషాలు సినిమాకే హైలైట్‌.

మైనస్ పాయింట్స్:

సినిమాకు మేజర్ మైనస్ పాయింట్స్  స్లో నేరేషన్,విక్రం కుమార్ మ్యాజిక్ కేవలం కొన్ని సీన్స్‌, సాంగ్స్‌కే పరిమితం కావడం. ఫస్టాఫ్‌లో హీరోయిన్ కల్యాణి పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడం.

సాంకేతిక విభాగం:

సాంకేతికంగా సినిమాకు మంచిమార్కులే పడతాయి. సినిమా ఉన్నతంగా ఉంది. ఒక మామూలు కథను అందంగా తెరకెక్కించడంతో పాటు ప్రేక్షకులను ఆకట్టుకునేలా తీయడంలో దర్శకుడు విక్రమ్ కుమార్ వందశాతం సక్సెస్‌అయ్యాడు. సినిమాకు మరో హైలెట్ అనూప్ రూబెన్స్ సంగీతం. బ్యాక్ గ్రౌండ్ స్కోరుతో ఇరగదీశాడు.   బాబ్‌ బ్రౌన్‌ ఫైట్స్‌, వినోద్‌ కెమెరా పనితనం సినిమా స్థాయిని మరింతగా పెంచేశాయి. అన్నపూర్ణ స్టూడియోస్‌ నిర్మాణ విలువలకు వంకపెట్టలేం.

 Hello movie review
తీర్పు:

కథ కొత్తదేం కాదు.. చిన్నప్పుడు స్నేహితులు పెద్దయ్యాక మళ్లీ కలుసుకోవడమనేది చాలా సినిమాల్లో చూసిందే. కానీ అఖిల్ రీలాంచ్‌ లాంటి సినిమా కోసం ఈ తరహా కథను ఎంచుకోవడం విశేషం. నాగ్‌ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని దర్శకుడు విక్రమ్‌ వందశాతం నిలబెట్టుకున్నాడు. అఖిల్  నటన,మ్యూజిక్,పాటలు సినిమాకు ప్లస్ కాగా స్లో నేరేషన్ మైనస్. మొత్తంగా క్రిస్మస్‌ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అఖిల్‌ రీ లాంచ్‌తో అదరగొట్టాడు.

విడుదల తేదీ:22/12/2017
రేటింగ్:3/5
న‌టీన‌టులు: అఖిల్ అక్కినేని,క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్
స‌ంగీతం: అనూప్ రూబెన్స్
నిర్మాత‌: అక్కినేని నాగార్జున‌
ద‌ర్శ‌క‌త్వం:  విక్ర‌మ్ కె.కుమార్‌.

- Advertisement -