హైద‌రాబాద్‌లో పలుచోట్ల వ‌ర్షం..

73
rains
- Advertisement -

గురువారం హైదరాబాద్‌లోని పలుప్రాంతాల్లో వర్షం కురిసింది. దీంతో ఒక్కసారిగా నగరంలో వాతావ‌ర‌ణం చ‌ల్ల‌బ‌డింది. ప‌లు ప్రాంతాల్లో ఈదురు గాలుల‌తో కూడిన వ‌ర్షం పడింది. న‌గ‌రంలోని బంజారా హిల్స్‌, జూబ్లీ హిల్స్‌, ఎస్ఆర్ న‌గ‌ర్‌ల‌లో భారీ వ‌ర్షం కుర‌వ‌గా… హ‌య‌త్ న‌గ‌ర్, ఎల్బీ న‌గ‌ర్‌, నాగోల్‌, వ‌న‌స్థ‌లిపురంల‌లో ఓ మోస్త‌రు వ‌ర్షం కురిసింది.

మిగిలిన ప్రాంతాల్లో వ‌ర్షం పెద్ద‌గా లేకున్నా.. ఈదురు గాలులు వీచాయి. అయితే ఉదయమంతా ఉష్ణోగ్రతల ప్రభావంతో, ఉక్కపోతతో నగర ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈరోజు కురిసిన వర్షం ఫ‌లితంగా ప్రజలకు ఎండ నుండి కాస్త ఉపశమనం లభించింది.

- Advertisement -