నంగునూర్ జెడ్పీటీసీ అభ్యర్థిగా ఉమా వెంకట్ రెడ్డి..

258
Siddipet MLA T Harish Rao
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో పరిషత్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలకావడంతో.. అభ్యర్థుల ఎంపికపై టీఆర్‌ఎస్ నాయకత్వం మరింత వేగాన్ని పెంచింది. మొదటి విడుత ఎన్నికల నామినేషన్ల దాఖలుకు కొద్దిరోజుల గడువు మాత్రమే ఉండటంతో ప్రక్రియను త్వరగా పూర్తిచేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా సిద్దిపేట నియోజకవర్గం చిన్నకోడూర్, నంగునూర్ మండలాల టీఆర్ఎస్ పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థులను మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీష్ రావు ప్రకటించారు.

పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు,చిన్నకోడూర్ మండల సీనియర్ నాయకులు,మాజీ మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు రోజా రాధాకృష్ణ శర్మని చిన్నకోడూర్ మండల జెడ్పిటీసీ అభ్యర్థిగా ప్రకటించగా.. పార్టీ సీనియర్ నాయకులు నంగునూర్ మాజీ జెడ్పీటీసీగా పనిచేసిన తడిసిన ఉమా వెంకట్ రెడ్డిని నంగునూర్ జెడ్పీటీసీ అభ్యర్థి గా ప్రకటించారు.

- Advertisement -