జెర్సీ దర్శకుడి సక్సెస్ స్టోరీ….

326
gowtham tinnanuri
- Advertisement -

సినిమాలు జ్ఞాపకాలుగా మారడం అరుదు. అలాంటి సినిమాలు ఎప్పుడో కానీ రావు. అలాంటి సినిమాలు వస్తే ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తుందనడానికి నిదర్శనం జెర్సీ.. నాని, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా నటించిన ఈ సినిమా అంతులేని భావోద్వేగాలను పండిస్తూ.. అఖండ విజయం సాధించింది. విమర్శకులతో పాటు సెలబ్రెటీలు సైతం హీరో నానితో పాటు దర్శకుడు గౌతమ్ తిన్ననూరిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. దీంతో అసలు ఎవరి గౌతమ్ తిన్ననూరి అని నెట్టింట్లో తెగ వెతికేస్తున్నారు.

ఐటీ ఉద్యోగిగా కెరియర్ ప్రారంభించిన గౌతమ్…‘మళ్లీ రావా’ చిత్రంతో దర్శకుడిగా మారారు. రెండో ప్రయత్నంలోనే జెర్సీ చిత్రంలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. రాజమండ్రిలో పుట్టి పెరిగిన గౌతమ్ అక్కడే ఇంజనీరింగ్ చేశారు. ఢిల్లీలో ఎంబీఏ చేశారు. బెంగుళూరు ఏక్సేంచర్‌లో ,హైదరాబాద్ డెలాయిట్‌లో జాబ్ చేశారు. 2012లో డైరెక్టర్ కావడం కోసం ఉద్యోగాన్ని వదిలి మెగా ఫోన్ అందుకున్నారు.

చిన్నప్పటి నుండే తనకు సినిమాలు అంటే ఇష్టమని అప్పటినుండే రాయడం అలవాటుగా చేసుకున్నానని చెప్పారు. తన చుట్టూ జరుగుతున్న సంఘటనలను పేపర్‌పై రాసేవాడినని తెలిపారు. నా స్నేహితుడు ఒకరు సినిమా తీస్తే దానికి డైలాగ్స్, స్క్రిప్ట్ రాసేవాడిని… అప్పుడే టెక్నికల్ వర్క్ తెలుసుకున్నానని చెప్పారు. ఎంత మంచి కథ అయినా చెప్పడం రాకపోతే ఆ కథ వేస్ట్. మొదట్లో నేనూ అలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేశానని తర్వాత రాటుదేలానని చెప్పారు. మొత్తంగా ఉత్తమ నటుడు నానిని అత్యత్తమ నటుడుగా తీర్చిదిద్దిన గౌతమ్ తిన్ననూరి ప్రతిభకు టాలీవుడ్ ఫిదా అయిపోతోంది.

- Advertisement -