ఇంటర్‌ రిజల్ట్స్‌….. గ్లోబరీనా సీఈవో ఏమన్నారో తెలుసా..!

387
globarina ceo
- Advertisement -

తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై పెను దుమారం చెలరేగుతున్న సంగతి తెలిసిందే. డేటా ప్రాసెసింగ్, రిజల్ట్స్‌ ప్రాసెసింగ్‌ (డీపీఆర్పీ) ప్రాజెక్టులో భాగంగా టెండర్ దక్కించుకున్న గ్లోబరీనా సంస్థపై పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో స్పందించారు ఆ సంస్థ సీఈవో వీఎస్‌ఎన్‌ రాజు.

గ్లోబరీనాపై కొంతమంది కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఏ విచారణకైనా సిద్ధమని ప్రకటించారు. తమ సంస్థకు 18 ఏళ్ల అనుభవం ఉందని ఏ రాజకీయ నాయకుడి ఒత్తిడితోనూ టెండర్ దక్కించుకోలేదన్నారు. ఇంటర్ రిజల్ట్స్ ప్రాజెక్టు కోసం మాగ్నటిక్, గ్లోబరీనా సంస్థలు టెండర్లు వేస్తే… తక్కువ బిడ్డింగ్, సాంకేతిక అనుభవం ఉన్న తమకే టెండర్ దక్కిందని తెలిపారు.

బోర్డు అధికారులు అడిగిన విధంగా తాము ప్రతిదీ పక్కా ప్రణాళికతో చేశామని స్పష్టం చేశారు. ఓఎంఆర్ బబ్లింగ్‌లో జరిగిన పొరపాటు వల్ల 99 మార్కులు వచ్చిన విద్యార్థికి సున్నా మార్కులు వచ్చినట్టు వివరణ ఇచ్చారు.నాస్కామ్‌తో పాటు తొమ్మిది వర్సిటీల్లో ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు విజయవంతంగా నిర్వహించామని సోషల్ మీడియాలో తమ కంపెనీపై వస్తున్న వదంతులను నమ్మ వద్దన్నారు.

- Advertisement -