రైతే రాజు కావాలి..:కేటీఆర్

248
Farmer is the king of TS: KTR
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం తీసుకురాబోతున్న రైతు బంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలవనుందని స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతు బంధు పథకం సన్నాహాక సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కేంద్ర బిందువు వ్యవసాయమని చెప్పారు. రైతులు యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని కేటీఆర్ పునరుద్ఘాటించారు.

రైతులు బాగుపడాలన్నదే ప్రభుత్వ అభిమతమని చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని వ్యవసాయంలో లాభాలు గడించాలన్నారు. ప్రతీ 5 వేల ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణాధికారిని నియమించినట్లు తెలిపారు. నాలుగేళ్లలో 24 లక్షల మెట్రిక్ టన్నుల గోదాంలను నియమించామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 700 పైగా గురుకులాలు ఏర్పాటు చేశామన్నారు.

Farmer is the king of TS: KTR

రైతులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని సూచించారు. మంచి జరుగుతుంటే చెడగొట్టే వారుంటారని కాంగ్రెస్‌ నాయకులపై మండిపడ్డారు కేటీఆర్. రైతులు బాగుపడుతుంటే కాంగ్రెస్ నాయకులు ఓర్వలేకపోతున్నారని తెలిపారు. అందుకే ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. ఉరూర ఒక పండగ వాతావరణంలో రైతు బంధు పథకం అమల్లోకి రానుందన్నారు. ప్రతి ఒక్కరు రైతు బంధు పథకంలో పాల్గొనాలని కేటీఆర్ సూచించారు. సిరిసిల్ల అభివృద్ధిపథంలో దూసుకుపోతున్నామని చెప్పారు.

- Advertisement -