ఎన్డీయే వైపే మొగ్గుచూపుతున్న ఎగ్జిట్ పోల్స్..!

274
NDA
- Advertisement -

సార్వత్రిక సమరం ముగియడంతో అందరిలో ఉత్కంఠ పెంచిన ఎగ్జిట్‌ పోల్స్‌ వచ్చేశాయి. తాజాగా, రిపబ్లిక్ సీ ఓటర్స్ ఎగ్జిట్ పోల్ అంచనాల ప్రకారం బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమికి 287 స్థానాలు, కాంగ్రెస్ ప్రాబల్యం ఉన్న యూపీయే కూటమికి 128 స్థానాలు వస్తాయని అంచనా వేశారు. ఇక న్యూస్ ఎక్స్ జాతీయ మీడియా చానల్ తన ఎగ్జిట్ పోల్స్ లో ఎన్డీయేకి 298 స్థానాలు, యూపీఏకి 118, ఇతరులు 126 స్థానాల్లో గెలవబోతున్నట్టు పేర్కొంది. దాదాపు ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఎన్డీయే వైపే మొగ్గుచూపుతున్నట్టు ట్రెండ్స్ చూస్తే అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో ఆయా సర్వే సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్‌ పోల్స్‌లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయో తెలుసుకుందాం..

సర్వే సంస్థలు భాజపా కాంగ్రెస్‌ ఇతరులు
టైమ్స్‌ నౌ-సీఎన్‌ఎక్స్‌ 306 132 104
ఎబీపీ న్యూస్‌ 108( 188 స్థానాలకే ప్రకటించారు) 24( 188 స్థానాలకే ప్రకటించారు) 56( 188 స్థానాలకే ప్రకటించారు)
న్యూస్‌ నేషన్‌ 282-290 118-126 130-138
వీడీపీఏ 333 115 94
రిపబ్లిక్‌ టీవీ‌ 287 128 127
రిపబ్లిక్‌ టీవీ -జన్‌ కీ బాత్‌ 295-315 122-125 102-125
రిపబ్లిక్‌ టీవీ – సీ- ఓటర్ 287 128 127
ఎన్డీటీవీ 302 127 133
టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా 306 152 84
- Advertisement -