సీఎం కేసీఆర్ వెంటే స్టాలిన్‌..!

366
kcr stalin
- Advertisement -

సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు మరికొద్దిరోజులు మాత్రమే మిగిలిఉండటంతో దేశ రాజకీయాల్లో శరవేగంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫెడరల్ రాగాన్ని ఎత్తుకున్న కేసీఆర్‌ వివిధ ప్రాంతీయ పార్టీల నేతలను కలుస్తున్నారు. ఫెడరల్ టూర్‌లో భాగంగా ఈ నెల 13న డీఎంకే చీఫ్‌ స్టాలిన్‌తో కేసీఆర్ భేటీ కావాల్సి ఉండగా తమిళనాడులో ఎన్నికల నేపథ్యంలో ఈ సమావేశం వాయిదా పడింది.

దీంతో తెలంగాణ సీఎంకు స్టాలిన్‌ ఝలక్ ఇచ్చారని పుకార్లు షికార్‌ చేస్తున్నాయి. ఈ పుకార్లకు చెక్ పెట్టారు డీఎంకే నేతలు. ఫెడరల్ ఫ్రంట్‌లో డీఎంకే చేరికను కొట్టిపారేయలేమని వ్యాఖ్యానిస్తున్నారు. కాంగ్రెస్,బీజేపీలకు పూర్తి మెజార్టీ రాని పక్షంలో ప్రాంతీయ పార్టీలు కీలకపాత్ర పోషిస్తాయని వారు అభిప్రాయపడుతున్నారు.

ప్రజలు మార్పు కోరుకుంటున్నారని లోక్ సభ ఎన్నికల్లో కూడా మార్పు కోసమే ఓటేశారని చెప్పారు. విషయాన్ని తాము బలంగా నమ్ముతున్నామని, లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు కూడా మార్పు కోసమే ఓటు వేశారని అన్నారు. రాజకీయాల్లో ఎటువంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

- Advertisement -