పాల్వాయి గోవర్థన్ రెడ్డి మృతి..

208
Congress MP Palvai is no more
Congress MP Palvai is no more
- Advertisement -

కాంగ్రెస్ సినీయర్ నేత,ఎంపీ పాల్వాయి గోవర్థన్ రెడ్డి కొద్దిపేపటి క్రితం గుండెపోటుతో మృతి చెందారు.  పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సమావేశంలో పాల్గోనేందుకు సిమ్లా వెళ్లిన గోవర్థన్ రెడ్డికి గుండెనొప్పి రావడంతో ఒక్కసారిగా వాహనంలోనే కుప్పకూలారు. గుండెపోటుకు గురైన పాల్వాయిని సహచరులు వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆయన్ని పరీక్షించి మృతిచెందినట్లు నిర్ధారించారు. ఆయనతో పాటు మరో 10 మంది ఎంపీలు కూడా కులుమనాలి మీటింగ్ కు వెళ్లారు.

గోవర్థన్ రెడ్డి మృతి పట్ల సీఎం కేసీఆర్ కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన మరణ వార్త తనను కలచివేసిందని చెప్పారు. పాల్వాయి మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.పాల్వాయి ఒక గొప్ప నేత అని కొనియాడారు. పాల్వాయి మృత దేహాన్ని ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు తీసుకు వచ్చేందుకు ప్రభుత్వ పరంగానే అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ , ఢిల్లీ రెసిడెంట్ కమిషనర్ అరవింద్ కుమార్‌ల‌ను సీఎం ఆదేశించారు. మృత దేహం తరలింపు తో పాటు అవసరమైన అన్ని కార్యక్రమాలను పర్యవేక్షించాలని ఎంపీ లు కె. కేశవ రావు, జితేందర్ రెడ్డి లను సీఎం కోరారు.

MPGovardhanReddy1

గోవర్థన్ రెడ్డి తెలంగాణ నుండి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.  పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి 1936 నవంబర్ 19న మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట మండలం నడింపల్లిలో జన్మించారు.  1967 నుంచి 1985 వరకు, 1999 నుంచి 2004 వరకు ఆరు సార్లు శాసనసభ్యుడిగా గెలుపొందారు. 2007 నుంచి 2009 వరకు శాసన మండలి సభ్యుడిగా ఉన్నారు. 2012 నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఆయనకు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు.

- Advertisement -