చింతమడకలో కేసీఆర్..బంజారాహిల్స్‌లో కేటీఆర్

339
cm kcr vote
- Advertisement -

దేశవ్యాప్తంగా తొలిదశ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఉదయం 7 గంటల నుండే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు బారులు తీరారు. లోక్ సభ ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్ దంపతులు సిద్దిపేట జిల్లాలోని చింతమడకలో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

ఉదయం ప్రత్యేక హెలికాప్టర్‌లో హైదరాబాద్‌ నుండి చింతమడకకు వెళ్లి, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఆవరణలోని పోలింగ్‌ కేంద్రానికి చేరుకుంటారు. అనంతరం అక్కడ ఓటు హక్కు వినియోగించుకుంటారు. సీఎం కేసీఆర్‌, సతీమణి శోభ 2018 డిసెంబరు 7న జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఓట్లు వేశారు.రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక తొలిసారిగా సొంత గ్రామానికి రానుండటం ప్రత్యేకత సంతరించుకుంటోంది.

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ బంజారాహిల్స్‌ నందినగర్‌లోని జీహెచ్‌ఎంసీ కమ్యూనిటీ హాలులో ఓటుహక్కు వినియోగించుకుంటారు. ఈ పోలింగ్‌ కేంద్రం సికింద్రాబాద్‌ నియోజకవర్గ పరిధిలోని ఖైరతాబాద్‌ అసెంబ్లీ పరిధిలో ఉంది. గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు ఉదయం 9 గంటల ప్రాంతంలో సోమాజీగూడ ఎంఎస్‌ మక్తాలోని అంగన్‌వాడీ కేంద్రం వద్ద బూత్‌లో ఓటువేయనున్నారు.

- Advertisement -