జాతీయ స్ధాయిలో సీఎం కేసీఆర్ ప్రచారం:కేటీఆర్

228
kcr mamatha
- Advertisement -

దేశరాజకీయాలన్ని ఢిల్లీ చుట్టూ కాదు హైదరాబాద్ చుట్టు తిరిగే పరిస్థితి రాబోతుందని చెప్పారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తొలిదశ ఎన్నికల్లో తెలంగాణలో ప్రచారం ముగిసిన తర్వాత జాతీయ స్ధాయిలో కేసీఆర్ ప్రచారం చేస్తారని తెలిపారు. ఇందుకోసం ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని తెలిపిన కేటీఆర్ భవిష్యత్ ప్రాంతీయ పార్టీలదేనన్నారు.

ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన కేటీఆర్ చంద్రబాబుకు కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేశారని చెప్పారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చంద్రబాబు కాలుకు బల్పం కట్టుకుని తిరిగితే కేవలం ఒక్క సీటు వచ్చిందని,అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ మొత్తం తిరిగితే రెండు సీట్లు వచ్చాయన్నారు.లోక్ సభ ఎన్నికల్లో కనీసం పోటీకి సాహసం చేయలేకపోతున్నారని ..ఇంతకంటే చంద్రబాబుకు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఇంకేమీ ఉంటుందన్నారు. చంద్రబాబుకు రిటైర్ మెంట్ టైమ్ దగ్గరపడిందన్న కేటీఆర్ జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ కీలకపాత్ర పోషిస్తుందని చెప్పారు.

ఎన్నికల తర్వాత ఢిల్లీని యాచించడం కాదని.. శాసిస్తామన్నారు కేటీఆర్‌. ప్రాంతీయ పార్టీల మద్దతు లేకుండా ఏ జాతీయ పార్టీ ఢిల్లీ గద్దెనెక్కే పరిస్థితే లేదని చెప్పారు. తెలంగాణ ప్రజలు టీఆర్‌ఎస్ వైపే ఉన్నారని స్పష్టం చేశారు .70 ఏళ్ల పాలనలో దేశానికి కూడా ఒరిగిందేమి లేదని చెప్పారు. ఇన్నాళ్లైనా ఇంకా కరెంట్ లేని పల్లెలు దేశంలో ఉన్నాయంటే ఈ రెండు పార్టీలే కారణమన్నారు కేటీఆర్. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా అడిగితే కేంద్రం ఇవ్వలేదని ఆరోపించారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఎంపీలు గెలిస్తే రాహుల్‌కు, బీజేపీ ఎంపీలు గెలిస్తే మోదీకి లాభం కలుగుతుందని.. టీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తేనే తెలంగాణకు లాభమన్నారు.

ఏపీ రాజకీయాలన్ని కేసీఆర్ చుట్టే నడుస్తున్నాయని తెలిపారు. కేసీఆర్‌ని తిట్టడమే చంద్రబాబుకు పనైపోయిందన్నారు. ఏడాది క్రితం తెలంగాణ ప్రభుత్వ పనితీరు,పవర్ సమస్యను అధిగమించారని మెచ్చుకున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పుడు ఎందుకు మాటమారుస్తున్నారో సమాధానం చెప్పాలన్నారు. చంద్రబాబు పాలవ్యాపారం,ఫామ్ హౌజ్ ఇక్కడే ఉందని ఎక్కడా ఆటంకం కలిగించలేదన్నారు.

చేసింది చెప్పుకోలేక చంద్రబాబుకు కేసీఆర్‌ని బూచిగా చూపి ఓట్లు దండుకుంటున్నారని చెప్పారు. ఆంధ్రా రాజకీయాల్లో వేలు పెట్టాల్సిన అవసరం తమకు లేదని జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించేందుకే వైసీపీ మద్దతు కోరామన్నారు.

వల్లభనేని వంశీ,జయసుధలను బెదిరించామని ప్రచారం చేస్తున్నారు దమ్ముంటే నిరూపించాలన్నారు. సికింద్రాబాద్ నుండి పోటీచేస్తున్న కిషన్ రెడ్డికి కేంద్రమంత్రి పదవి వస్తుందన్న వార్తలు పుకార్లే అన్నారు. తెలంగాణ నుండి కేంద్రమంత్రిగా ఉన్న దత్తన్నను పదవి నుండి ఎందుకు తొలగించాలో చెప్పాలన్నారు.జైకిసాన్ అనేది కాంగ్రెస్,బీజేపీలకు నినాదమని తమకు విధానమన్నారు. కలిసివస్తే దేశ రాజకీయాల్లో టీఆర్ఎస్ నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుందని స్పష్టం చేశారు.

- Advertisement -