కరుణానిధిని కలిసిన కేసీఆర్..

296
CM KCR for Chennai to meet Karunanidhi
- Advertisement -

దేశంలో గుణాత్మక మార్పు రావాల్సి ఉందని అంటోన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్… బీజేపీ, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్‌ కోసం ప్రయత్నాలు కొనసాగిస్తోన్న విషయం తెలిసిందే. ఈ విషయంలో తన ప్రయత్నాల్లో వేగం పెంచారు. ఈ రోజు ఫెడరల్ ఫ్రంట్‌పై చర్చల కోసం కేసీఆర్ చెన్నై చేరుకున్నారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రి ఈటల రాజేందర్, ఎంపీలు కేకే, వినోద్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి ఉన్నారు. ఫెడరల్ ఫ్రంట్‌లో అన్ని రాష్ర్టాలకు ప్రాతినిధ్యం ఉండాలని భావిస్తున్న సీఎం.. దేశహితం కోసం కలిసి వచ్చే ప్రాంతీయ పార్టీలతో, నాయకులతో చర్చలను ముమ్మరం చేస్తున్నారు.

CM KCR for Chennai to meet Karunanidhi

ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీతో చర్చించిన సీఎం.. తదుపరి జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత దేవెగౌడ, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామితోనూ సమాలోచనలు జరిపిన విషయం తెలిసిందే. తమిళనాడు రాజధాని చెన్నైకి చేరుకున్న సీఎం డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధితో సమావేశమయ్యారు. అనంతరం డీఎంకే వర్కింగ్ ప్రసిడెంట్ స్టాలిన్ తో సమావేశమయ్యారు.

- Advertisement -