రాళ్లపల్లికి పెద్ద అభిమానిని:చిరు

43
chiranjeevi

సినీనటుడు రాళ్లపల్లి మృతిపై దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు మెగాస్టార్ చిరంజీవి. రాళ్లపల్లికి తాను పెద్ద అభిమానినని అని చెప్పిన చిరు ఆయనతో తనకున్న జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. రాళ్లపల్లి చక్కని స్నేహశిలి అని చెప్పిన మెగాస్టార్ తొలిసారి చెన్నైలోని వాణి మహల్‌లో నాటకాలు వేస్తున్నప్పుడు ఆయనను కలిశానని గుర్తుచేసుకున్నారు.

చెన్నైలో తొలిసారి ఆయన నటనను స్టేజ్‌పై చూసి ముగ్ధుడినయ్యానని చెప్పారు. రాళ్లపల్లి నటనను ఎంతో అభిమానించే వాడిని… ఆ తర్వాత రాళ్లపల్లి వెండి తెరపైకి వచ్చారని చెప్పారు. నాతో కలిసి పలు సినిమాల్లో నటించిన సందర్భంలో ఆయనతో అనుబంధం ఏర్పడిందన్నారు.

‘మా’ ఎన్నికల సందర్భంగా కలుసుకున్నాం. ఆ సందర్భంలో ‘ఎలా ఉన్నావు మిత్రమా?’ అంటూ ఇద్దరం ఒకరినొకరం పరస్పరం పలకరించుకున్నాం. అదే ఆఖరి చూపు అయిందన్నారు. రాళ్లపల్లి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చెప్పిన చిరు వారి కుటుంబసభ్యులకు ప్రగాఘ సానుభూతి తెలిపారు.