కేసీఆర్‌కు చంద్రబాబు,కృష్ణ విషెస్..

247
kcr chandrababu
- Advertisement -

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు,సినీ నటుడు కృష్ణ…కేసీఆర్‌కు శుభాకాంక్షలు చెప్పారు.తెలంగాణలో ప్రజాతీర్పును గౌరవిస్తున్నామని… ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కేసీఆర్‌తో పాటు తెలంగాణలో గెలుపొందిన శాసనసభ్యులందరికీ అభినందనలు తెలిపారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీ సొంతం చేసుకుని విజయంవైపు దూసుకుపోతున్న సీఎం కేసీఆర్‌కు సీనియర్‌ నటుడు కృష్ణ అభినందనలు చెప్పారు. నాలుగున్నరేళ్ల కాలం పరిపాలన తర్వాత ఇంత అత్యధిక స్థానాలలో విజయం సాధించి మళ్లీ అధికారంలోకి రావడం చాలా గొప్ప విషయమన్నారు. కేసీఆర్‌ ప్రవేశ పెట్టిన పథకాలన్నీ ప్రజలకి ఎంతో మేలు చేశాయని తెలిపారు.

అందుకే అన్ని వర్గాల ప్రజలు ఆయనకి ఈ అఖండ విజయాన్ని అందించారు. మళ్లీ రెండోసారి తెలంగాణకి ముఖ్యమంత్రిగా బాధ్యతల చేపడుతున్న కె. చంద్రశేఖర్‌రావు గారికి నా హృదయపూర్వక అభినందనలు అని కృష్ణ చెప్పారు.

గజ్వేల్‌ నియోజకవర్గంలో కేసీఆర్‌ ప్రత్యర్థి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి వంటేరు ప్రతాపరెడ్డిపై గెలుపొందారు. గత ఎన్నికల్లో 19,366 ఓట్లతో వంటేరుపై గెలిచిన కేసీఆర్‌.. ఈ సారి ఎన్నికల్లో 50వేలకు పైగా మెజార్టీతో విజయం సాధించారు.

- Advertisement -