పార్ల‌మెంట్‌లో క్యాస్టింగ్ కౌచ్…

233
modi renuka
- Advertisement -

టాలీవుడ్‌లో కొంతకాలంగా క్యాస్టింగ్ కౌచ్‌ అంశంపై వివాదం రగులుతున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో టాలీవుడ్‌లో క్యాస్టింగ్‌ కౌచ్‌పై సెర్ఫ్‌ కమిటీ వేయగా తాజాగా రాజకీయాల్లో క్యాస్టింగ్‌ కౌచ్ ఉందని సంచలన వ్యాఖ్యలు చేసింది కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి.

వేధింపులకు పార్లమెంటు కూడా మినహాయింపేమీ కాదని తెలిపింది రేణుకా. క్యాస్టింగ్ కౌచ్ లాంటి వాటికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమం రావాలని, దానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఇది చేదు వాస్తమని …హాలీవుడ్‌లో సాగుతున్న మీటూ ప్రచారం తరహాలో దేశంలో కూడా బాధితులు పోరాడాలని సూచించారు.

ఫిల్మ్ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంటుందని బాలీవుడ్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ వెల్లడించగా…ఆ వ్యాఖ్యలను సమర్ధిస్తూ రేణుకా స్పందించింది.మరోవైపు క్యాస్టింగ్ కౌచ్ అంశంపై బాలీవుడ్ న‌టుడు ర‌ణ్‌బీర్ క‌పూర్ కూడా స్పందించారు. తానెప్పుడు ఇలాంటి ప‌రిస్థితి ఎదుర్కోలేదని…ఒక‌వేళ అలాంటివి ఉంటే, అది నిజంగా బాధాక‌ర‌మ‌ని అన్నారు.

- Advertisement -