ఓటు వేసే ముందు.. ఆవుకు పూజ చేసిన బీజేపీ నేత..

320
- Advertisement -

కర్ణాటకలో ప్రస్తుతం పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. 222 స్థానాలకు పోలీంగ్ జరుగుతుండగా.. ఈ ఎన్నికలలో 2600 మంది రాజకీయనాయకులు తమ రాజకీయ భవిష్యత్తును పరీక్షించుకోనున్నారు. అయితే ఓటింగ్ కు ముందు బీజేపీ ప్రధాన అభ్యర్థుల్లో ఒకరైన బి. శ్రీరాములు చేసిన ఒక పని ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఓటుహక్కు వినియోగించుకునే ముందు బళ్లారిలోని తన నివాసంలో ఆయన గోపూజ నిర్వహించారు. కాషాయ పంచెను ధరించి, కాషాయం కండువాను కప్పుకుని ఆయన గోమాతకు పూర్తిగా పసుపు రాసి, పూజలు చేశారు.

BJPs Sriramulu does cow pooja

46 ఏళ్ల శ్రీరాములు మైనింగ్ కింగ్ గాలి జనార్ధన్ రెడ్డి ప్రధాన అనుచరుడు. ఈ ఎన్నికలలో బళ్లారి సమీపంలోని, మొలకల్ల్మూర్ తో పాటు, బాదామి నియోజకవర్గం నుంచి సీఎం సిద్దరామయ్యపై పోటీచేస్తున్నారు .కర్ణాటక ఎన్నికల ప్రచారంలో శ్రీరాములు ఒక స్టార్ క్యాంపెయినర్ గా మారారు. బీజేపీ అధిష్టానం ఎన్నికల ప్రచారానికి ఆయనకు హెలికాప్టర్ కూడా ఏర్పాటు చేసింది. మరోవైపు బీజేపీ అధికారంలోకి వస్తే శ్రీరాములను డిప్యూటీ సీఎం చేసే అవకాశాలు కూడా ఉన్నాయని వార్తలు కూడా వినిపించాయి.

BJPs Sriramulu does cow pooja

మరోవైపు కర్ణాటకలు ఎన్నికల ఫలితాలు రెండు పార్టీలకు కీలకంగా మారనున్నాయి. బీజేపీ, కాంగ్రెస్, ఈ రెండు పార్టీలకు ఈ ఎన్నికల ఫలితాలే.. 2019లో జరిగే ఎన్నికలపై ప్రభావం చూపనుంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చి హస్తం పవర్ చూపనుందా..? అయితే రాహుల్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటగా జరుగుతున్న ఎన్నికలు కావున ఇప్పుడు కర్ణాటకలో హంగ్ అధికారంలోకి వస్తేనే రాహుల్ నాయకత్వంపై కాంగ్రెస్ నాయకులకు, ఆపార్టీని అభిమానించే ప్రజలకు నమ్మకం కల్గుతుంది.

అయితే వరుసగా పలు రాష్ట్రాల ఎన్నికలలో బీజేపీ విజయకేతనం ఎగురవేస్తూ వస్తుంది. కానీ ఈ మధ్య మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన జీఎస్టీ, నోట్ల రద్దు వంటి వాటివల్ల ప్రజల్లో మోడీ ప్రభుత్వంపై తీవ్ర అసహనం వ్యక్తం అవుతుంది. ఇలాంటి సమయంలో మోడీ ప్రభుత్వానికి కర్ణాటక ఎన్నికలే కీలకంగా మారాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తేనే.. 2019 ఎన్నికలలో సానుకూల అభిప్రాయం వచ్చే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

- Advertisement -