నాగబాబు వ్యాఖ్యలపై మండిపడ్డ శ్రీరెడ్డి…

267
Sri Reddy Fire On Nagababu
- Advertisement -

నటి శ్రీరెడ్డి వ్యాఖ్యలపై కొద్దిసేపటి క్రితమే నటుడు నాగబాబు స్పందించిన సంగతి తెలిసిందే. జూబ్లీహిల్స్‎లోని ఫిల్మ్‌ ఛాంబర్‌లో విలేకరుల సమావేశంలో పాల్గొని ఆయన శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ పోరాటం పక్కదారి పట్టిందని, సంబంధంలేని వారు ఈ అంశంలోకి వచ్చి పోరాటాన్ని పక్కదోవ పట్టించారని, వ్యక్తిగత అంశాలపై మాట్లాడరాదని శ్రీరెడ్డిపై ఆయన మండిపడిన విషయం తెలిసిందే. అయితే నాగబాబు వ్యాఖ్యలపై తాజాగా నటి శ్రీరెడ్డి సోషల్ మీడియా వేధికగా మండిపడ్డింది.

శ్రీరెడ్డి తన ఫేస్‎బుక్ పేజీలో ఒక పోస్ట్ చేసింది. నాగబాబు గారు మీరు మానవతావాదిననుకుంటున్నారా..? మీకు దయ ఉందా? ఓ మై గాడ్.. మీకు దయ. జాలీ లేవు…? మీరు ఎంతో క్రూరులు. మీరు అడిగే ప్రతి ప్రశ్నకు నేను జవాబు చెబుతా వేచిఉండండి. మీరు ఫర్పెక్ట్ అని అనుకుంటున్నారా.? మీరు పర్ఫెక్ట్ కాదు అని తెలియజేశారు. సైకియాట్రిస్టు ఎవరికి అవసరం ఉందో వేచిఉండండి చెబుతానని.. నా సలహాలు మీరు పాటిస్తారని అనుకుంటున్నాను అంటూ ఫేస్ బుక్ వేదికగా మండిపడింది.

Sri Reddy Fire On Nagababu

- Advertisement -