తెలుగులో భారీ స్థాయిలో విడుదలకానున్న “అవెంజర్స్”..

306
Avengers: Endgame
- Advertisement -

ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం అవెంజర్స్ ఎండ్ గేమ్. ఈ నెల 26న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలతో విడుదలౌతోంది. ఇటీవలే విడుదల చేసిన ట్రైలర్ కు అద్భుతమైన స్పందన లభించింది. దీంతో ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 500కు పైగా థియేటర్లలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. హాలీవుడ్ రూపొందించిన ఓ చిత్రాన్ని తెలుగు డబ్బింగ్ రూపంలో ఇంత భారీ స్థాయిలో అత్యధిక థియేటర్లలో తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయడం ఇదే తొలిసారి. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు… ఈ సినిమాకున్న డిమాండ్ ను.

Avengers: Endgame

ఈ సినిమాను మార్వెల్ స్టూడియోస్ నిర్మిస్తోంది. ప్రముఖ హాలీవుడ్‌ నటుడు రాబర్ట్‌ డౌనీ జూనియర్ నటిస్తున్న ఈ చిత్రంలో క్రిస్‌ ఇవాన్స్‌, మార్క్ రఫాలో, క్రిస్ హేమ్స్ వర్త్, స్కార్లెట్ జాన్సన్ వంటి స్టార్స్ నటిస్తున్నారు. ‘అవెంజర్స్‌’ సిరీస్‌ నుంచి వస్తున్న చివరి సూపర్‌హీరో చిత్రమిదని హాలీవుడ్‌ వర్గాల సమాచారం. ‘అవెంజర్స్‌: ఎండ్‌ గేమ్‌’ చిత్రానికి రుస్సో బ్రదర్స్‌ దర్శకత్వం వహించారు. ఇంగ్లిష్‌తో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లోనూ సినిమా విడుదల కాబోతోంది.

ఏడాది విరామం తర్వాత అవెంజర్స్‌ సిరీస్‌ చివరిదైన ‘అవెంజర్స్‌: ఎండ్‌గేమ్‌’ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధం కావడంతో అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. గత చిత్రంలో థానోస్‌ శక్తితో కనిపించకుండాపోయిన అవెంజర్స్‌ మళ్లీ తిరిగి ఎలా వచ్చారు? థానోస్‌ను ఎలా అంతం చేశారన్నదే ఈ కథ. థానోస్‌ పాత్రకి భల్లాలదేవ రానా తెలుగు డబ్బింగ్ చెప్పిన సంగతి తెలిసిందే. ‘ది అవెంజర్స్-ఎండ్ గేమ్’ కోసం సంగీత సంచలనం ఏ.ఆర్.రెహమాన్ రూపొందించిన పాట కూడా విశేష ఆదరణ పొందింది. ఈ మూవీ ఇదివరకే కొన్ని ఆసియా దేశాల్లో నిన్ననే విడుదల చేశారు. అలా చైనాలో ఈ సినిమా నిన్న భారీ స్థాయిలో విడుదలైంది. తొలిరోజునే అక్కడ ఈ సినిమా 750 కోట్ల వసూళ్లను రాబట్టినట్టు సమాచారం.

- Advertisement -