ఆచారి ప్రిరిలీజ్‌కు ముహుర్తం ఖ‌రారు…

234
Achari America Yatra Pre-Release
- Advertisement -

మంచు విష్ణు హీరోగా వస్తున్న కొత్త సినిమా ‘ఆచారి అమెరికా యాత్ర’. ఈ సినిమాలో బ్రహ్మానందం కీలకపాత్రలో నటిస్తుండగా విష్ణు సరసన ప్రగ్యా జైశ్వాల్‌ ఆడిపాడుతోంది. పద్మజా పిక్చర్స్‌ పతాకంపై జి నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి కీర్తి చౌదరి, కిట్టు నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా.. తమన్ స్వరాలు సమకూర్చారు.

జ‌న‌వ‌రి 20న ప్రీ రిలీజ్ వేడుక‌ను ఘ‌నంగా నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జ‌న‌వ‌రి 20న ఉద‌యం 11 గంట‌ల‌కు ద‌స్ప‌ల్లా హోట‌ల్‌లో అతిర‌థ మ‌హార‌థుల మ‌ధ్య జ‌ర‌గ‌నుంది.

ఇటీవ‌ల విడుద‌లైన టీజర్ ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంటోంది. బ్రహ్మానందం డైలాగ్స్‌తో మొదలైన టీజర్ …. సంభావనలో చాలా మార్పులుంటాయని, పూజారులుగా అమెరికాలో అయితే ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు అనే ఆలోచనతో అమెరికా వెళ్లిన విష్ణు, బ్రహ్మి టీమ్ అక్కడ ఎదుర్కొన్న సమస్యలను నవ్వు పుట్టించేలా ఆసక్తికరంగా ఈ టీజర్‌లో చూపించారు. రిపబ్లిక్ డే కానుకగా సినిమాను జనవరి 26 న ప్రేక్షకుల ముందుంచేందుకు ప్లాన్ చేస్తోంది యూనిట్.

- Advertisement -