గోపీచంద్ “ఆరడుగుల బుల్లెట్” ట్రైలర్..

281
Aaradugula Bullet Trailer Released
- Advertisement -

యాక్షన్ హీరో గోపీచంద్-సెన్సేషనల్ డైరెక్టర్ బి.గోపాల్ ల కాంబినేషన్ లో జయా బాలాజీ రియల్ మీడియా పతాకంపై తెరకెక్కుతున్న భారీ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ “ఆరడుగుల బుల్లెట్” చిత్రం ట్రైలర్ ను నేడు (మే 5న) చిత్ర బృందం విడుదల చేసింది. తాండ్ర రమేష్ నిర్మాణ సారధ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో గోపీచంద్ సరసన నయనతార కథానాయికగా నటించగా.. మణిశర్మ సంగీత సారధ్యం వహించారు.

Aaradugula Bullet Trailer Released

ట్రైలర్ విడుదల సందర్భంగా చిత్ర నిర్మాత తాండ్ర రమేష్ మాట్లాడుతూ.. “ఇంద్ర, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు చిత్రాల అనంతరం బి.గోపాల్ నుంచి వస్తున్న మరో ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్ టైనర్ “ఆరడుగుల బుల్లెట్”. ఈ చిత్రంలో గోపీచంద్ క్యారెక్టర్ ను బి.గోపాల్ మలిచిన తీరు.. నయనతార గ్లామర్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయి. అలాగే సినిమా కోసం స్విట్జర్లాండ్, పోర్చుగల్ లాంటి దేశాల్లో చిత్రీకరించిన పాటలు ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకొంటాయి. ప్రముఖ రచయితలు వక్కంతం వంశీ అందించిన కథ, అబ్బూరి రవి మాటలు సినిమాకి హైలైట్స్ గా నిలుస్తాయి. గోపీచంద్ కెరీర్ లో ఈ చిత్రం ఓ మైలురాయిగా నిలుస్తుంది” అన్నారు.

ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, అభిమన్యు సింగ్, చలపతిరావ్, సలీం బేగ్, ఉత్తేజ్, జయప్రకాష్ రెడ్డి, ఫిరోజ్ అబ్బాసి, రమాప్రభ, సురేఖావాణి, సన, సంధ్యా జనక్, మధునందన్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, కథ: వక్కంతం వంశీ, మాటలు: అబ్బూరి రవి, ఫైట్స్: కనల్ కణ్ణన్, సినిమాటోగ్రఫీ: బాల మురుగన్, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వర్రావు, ఆర్ట్: నారాయణ రెడ్డి, నిర్మాత: తాండ్ర రమేష్, దర్శకత్వం: బి.గోపాల్!

 

- Advertisement -