రైతు బంధు…ప్రజల వద్దకే పాలన:కేటీఆర్

236
30 bedded hospital for Illanthakunta
- Advertisement -

రైతు బంధు అంటే ప్రజల వద్దకే పాలన అన్నారు మంత్రి కేటీఆర్. సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంటలో రైతు బంధు చెక్‌లను పంపిణీ చేసిన కేటీఆర్… గత ప్రభుత్వాల హయాంలో పాస్ బుక్కు కావాలంటే రైతులు అధికారులు చుట్టు తిరిగేవారని.. ఇప్పుడు అధికారులే రైతుల దగ్గరకు వచ్చి పాస్ బుక్కులు, చెక్కులు ఇస్తున్నారన్నారు. దేశంలోనే అన్నిరంగాల్లో తెలంగాణ ముందుకెళ్తుందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కాంగ్రెస్,బీజేపీ నేతలకు కనిపించడం లేదని…వారికి కంటి పరీక్షలు నిర్వహించి జనజీవన స్రవంతిలో కలుపుతామని చెప్పారు.

నాలుగేళ్లలోనే రైతుల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టామన్నారు. రైతులకు సంపూర్ణ రుణమాఫీ చేశామని.. ఇప్పుడు పంటకు పెట్టుబడి కింద ఎకరాకు రూ.8 వేలు ఇస్తున్నామన్నారు. 71 ఏళ్లలో 16 మంది ముఖ్యమంత్రులు చేయని పనిని అన్నదాతల కోసం రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్ దే అన్నారు.రైతు బంధు పథకంతో సీఎం కేసీఆర్ అన్నదాతల ఆత్మబంధువుగా మారాడని చెప్పారు. మిషన్ భగీరథ పథకాన్ని నీతి ఆయోగ్ మెచ్చుకుందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జోరుగా సాగుతోందని వెల్లడించారు. పంట పెట్టుబడి పథకంతో రైతులు పండగ చేసుకుంటున్నారన్నారు.

30 bedded hospital for Illanthakunta

ఇల్లంతకుంటలో 30 పడకల ఆస్పత్రిని నిర్మిస్తామని..కోటి రూపాలయతో సెంట్రల్ లైటింగ్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. గోదావరి జలాలు తీసుకువచ్చి ఇల్లంతకుంట ప్రజల కాళ్లుకడుగుతమన్నారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే రాష్ట్రంలో విద్యుత్ సమస్య లేకుండా చేసినట్లు వెల్లడించారు. రైతులకు 24 గంటల విద్యుత్ అందిస్తున్నమన్నారు. 67 ఏళ్లలో గత పాలకులు 4 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాములు నిర్మిస్తే.. నాలుగేళ్లలో 20 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాములు నిర్మించినట్లు చెప్పారు. ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కోరారు. నీటి తీరువా బకాయిలను రద్దు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు.

- Advertisement -