ఈజిప్టులో మారణహోమం.. 200 మంది మృతి

201
egyptmasjid
- Advertisement -

ఈజిప్టులో దారుణం జరిగింది. మసీదుపై ఉగ్రవాదులు బాంబులతో విరుచుకుపడ్డారు. సుమారు 235 మంది చనిపోగా.. 200 మందికిపైగా గాయపడ్డారు. ఈజిప్టులోని సినాయ్‌ ద్వీపకల్పంలో ఉన్న మసీదులో ఈ దురాఘతానికి పాల్పడ్డారు. బాంబులు విసిరి, విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డారు. మధ్యాహ్నం ప్రార్థనల అనంతరం బయటకు వచ్చిన సందర్భంలో కాల్పులు జరిపినట్టు ప్రత్యక్షసాక్షులు, భద్రతా సిబ్బంది తెలిపారు. గాయపడినవారిని చికిత్స కోసం స్థానిక ఆస్పత్రులకు తరలించారు. అయితే అంబులెన్స్‌లపైనా కాల్పులకు తెగబడ్డారు ఉగ్రవాదులు.బిల్ అర్ అబ్ద్ మసీదులో జరిగిన సంఘటన యావత్ ముస్లిం దేశాలను నివ్వరపరిచింది. ఈజిప్టు ప్రజలు కూడా తీవ్ర షాక్‌కు గురయ్యారు.

235 killed- 200 injured in Egypt

ఉగ్రవాదులు ప్రత్యేకంగా సూఫీ ముస్లింలను టార్గెట్ చేసినట్లు అనుమానిస్తున్నారు. భారీ వాహనంలో మసీదుకు వచ్చిన దుండగలు.. మసీదులో బాంబులు పేల్చారు. అక్కడ నుంచి పారిపోతున్న వారిని గన్నులతో కాల్చేశారు. మసీదు దాడిలో ఓ సూసైడ్ బాంబర్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సూఫీ ముస్లింలు ఇస్లాం మతంలో ప్రత్యేకమైనవాళ్లు. సాంప్రదాయ ముస్లింలు, సున్నీ తీవ్రవాదులు.. సూఫీ ముస్లింలను మత విరోధులగా భావిస్తారు.

235 killed- 200 injured in Egypt

బిర్ అల్ అబ్ద్ ప్రాంతంలో ఇటీవల ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల అనేక మంది సూఫీలను చంపేశారు. కానీ గతంలో వాళ్లు ఎప్పుడూ ఓ మసీదును టార్గెట్ చేయలేదు. అయితే ఈ సారి మసీదులోనే సూఫీ ముస్లింలను హతమార్చడం ఇస్లామిక్ స్టేట్ వికృతత్వాన్ని బయటపెడుతున్నది. ఈ మారణకాండ నేపథ్యంలో ఈజిప్ట్‌ దేశాధ్యక్షుడు అబ్దెల్‌ ఫత్తా అల్‌ సిసీ భద్రతా అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈజిప్ట్‌లో భద్రతా దళాలు, ఇస్లామిక్‌ స్టేట్‌ మధ్య యుద్ధం ఎప్పటినుంచో కొనసాగుతోంది. గత మూడేళ్లకు పైగా కొనసాగుతున్న ఈ యుద్ధంలో వందలాది మంది పోలీసులు, సైనికుల్ని ఉగ్రవాదులు హతమార్చారు. ఉగ్రవాదులు ఎక్కువగా భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకొని దాడులకు తెగబడుతున్నారు.

- Advertisement -