18 ఏళ్ల సినీ కెరీర్‌..అల్లరి నరేష్ భావోద్వేగం

475
allari naresh
- Advertisement -

రవిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన అల్లరి చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన హీరో అల్లరి నరేష్. 2002 మే 10న విడుదలైన ఈ సినిమాతో అల్లరి నరేష్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు నరేష్. కెరీర్‌లో వేగంగా 50 సినిమాలను పూర్తిచేసుకున్న నరేష్‌ కొంతకాలంగా వరుస పరాజయాలతో డీలా పడ్డాడు. ఈ నేపథ్యంలో భారీ ఆశలతో మహేష్ హీరోగా తెరకెక్కిన మహర్షి చిత్రంలో కీలకపాత్ర పోషించాడు. ఈ సినిమాలో నరేష్ పోషించిన రవి పాత్రకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ నేపథ్యంలో అల్లరి నరేష్ నుండి మహర్షి నరేష్ వరకు జర్నీని గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. మహర్షి సినిమాకి వస్తోన్న రెస్పాన్స్,తన పాత్రకి దక్కుతోన్న ఆదరణ ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పాడు. ఈ సినిమాతో నా లైఫ్‌ సర్కిల్ పూర్తయినట్లు భావిస్తున్నానని తెలిపాడు.

55 సినిమాల నా ప‌య‌నం ఎంతో సంతృప్తికరంగా సాగింది. ఈ ప‌రిశ్ర‌మ‌లో నా ఎదుగుద‌ల‌కు కార‌ణ‌మైన, నాపై న‌మ్మ‌క‌ముంచిన‌ అంద‌రు ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు, సాంకేతిక నిపుణులు, ప్రేక్ష‌కుల‌కు హృద‌య‌పూర్వక శుభాకాంక్ష‌లు అని లేఖ‌లో పేర్కొన్నాడు.

- Advertisement -